Sunday, 13 September 2026 11:58:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప

Date : 16 July 2026 03:10 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - జూలై 16 : ఈనెల 24వ తేదీ శుక్రవారం,మదనపల్లి నందు గల జిల్లా ఎస్టీయు కార్యాలయంలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిటి.కృష్ణప్ప పిలుపునిచ్చారు. బేస్తవారం ఉదయం 11 గంటలకు,బి.కొత్తకోట మండల సమితి సమావేశం బీరంగి గ్రామంలోని మొరవపల్లి నందు జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న టీ. కృష్ణప్ప,సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ; ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం సదురు హామీలను తుంగలో తొక్కి కష్టజీవులను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్లకు,ధనవంతులకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారు చౌకగా కట్టపెట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు సాగు భూమిని పంపిణీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2013 సంవత్సరం నుండి పేదలకు భూ పంపిణీ పూర్తిగా ఆగిపోయిందని, గతంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులు మేరకు భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి, ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వవచ్చని,అందుకు సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపినా కూడా ఆ సిఫార్సులను ప్రభుత్వాలు చెత్తబుట్టలో పడేసాయని విమర్శించారు.ఈ నేపథ్యంలో పేదలను సమాయత్తం చేసి మరో భూ పోరాటాలకు శ్రీకారం చుట్టాలనే లక్ష్యంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నదని,ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే సమావేశానికి అధిక సంఖ్యలో కష్టజీవులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశపు కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పి. నారాయణస్వామి,జి.శంకర,గంగన్న,రమణప్ప, రమణ,కదిరప్ప,మమత,రమాదేవి,ఈశ్వరమ్మ,ప్రేమకుమారి,నాగమ్మ త తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :