Sunday, 13 September 2026 05:58:12 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో సత్తా చాటిన మదనపల్లి శక్తి టీమ్ శశికళ

ఐదు పతకాల కైవసం తో సంచలనం

Date : 04 September 2026 01:50 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 04: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ అసాధారణ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలతో చరిత్ర సృష్టించింది. అమరావతి సమీపంలోని VIT-AP యూనివర్సిటీలో జరిగిన 1st AP State Police Sports & Games Meet-2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో తన పటిమ చూపింది. *రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం:* వ్యక్తిగత విభాగాల్లో ఆమె తిరుగులేని ఆధిపత్యం చాటింది. హ్యాండ్ రెజ్లింగ్ (ఆర్మ్ రెజ్లింగ్) లో బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే జోష్ తో బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచ్ ల మీద పంచ్ లు కురిపిస్తూ రెండో గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా రెజ్లింగ్ విభాగంలోనూ అద్భుతంగా పోరాడి కాంస్య పతకం (3వ స్థానం) సాధించింది. *జట్టు క్రీడల్లోనూ సత్తాచాటారు:* జట్టు క్రీడల్లో కూడా తన జట్టుకు వెన్నుదన్నుగా నిలిచింది. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళా హ్యాండ్ బాల్ జట్టు 3వ స్థానం సాధించడంలో తనవంతు కృషి చేసింది. దీంతో ఒకే మీట్ లో 2 గోల్డ్, 1 సిల్వర్ టీమ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం 5 పతకాలు సాధించిన ఘనత ఆమె సొంతమైంది. మహిళా భద్రత కోసం పనిచేసే శక్తి టీమ్ లో విధులు నిర్వహిస్తూనే, క్రీడల్లోనూ మహిళా పోలీసుల శక్తి ఏంటో శశికళ నిరూపించిందని జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఆమె విజయం జిల్లాలోని ఇతర మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: