Sunday, 13 September 2026 04:29:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సిపిఐ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక

జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డి

Date : 02 December 2025 05:16 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక - జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డి నియామకం - ప్రకటించిన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా నూతన కమిటి ఎన్నిక చేయడం జరిగిందని రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య ప్రకటించారు. మంగళ వారం స్థానిక అనప గుట్ట నందు కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సమావేశం రమణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య అన్నమయ్య జిల్లా కన్వినర్ గా పోరెడ్డి రమణా రెడ్డిని, కొ కన్వినర్ గా హరి ని నియమించడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతరం వారి నుండి పార్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కన్వీనర్ జి. రమణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయల సీమ కు ప్రత్యేక ప్యాకేజి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమ అభివృద్ధి కోసం కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కళాశాల లను పిపిపి పద్దతిలో కాకుండా, ప్రజల ఆరోగ్య బద్రత, వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వమే కొన సాగించాలని డిమాండ్ చేశారు. ఆసియా లో అతి పెద్ద టమోటా మార్కెట్ లో రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం కోసం కోల్డ్ స్టోరేజిలు, పుల్ప్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయా లన్నారు. జిల్లా కన్వీనర్ రమణా రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవా కాలువను పూర్తి స్థాయిలో తంబళ్ళ పల్లె, మదనపల్లె నియోజక వర్గాల్లో అను సంధానం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతుల సాగునీటి సమస్య కి పరిష్కారం లభి స్తుందన్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అలాగే అన్నమయ్య జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి రైతులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పన చెప్పటాలన్నారు. రాయల సీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కో కన్వీనర్ హరి మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు కష్టపడి పంటలు పండిస్తున్న వారికి సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతాంగం పై ప్రత్యేక శ్రద్ధను పెట్టి గిట్టుబాటు ధరలతో పాటు, ఉచిత పంటల బీమాను అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: