నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్బంగా అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావ్ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణం లోని బెంగళూరు బస్ స్టాండ్ వద్ద ప్రజలకు రోడ్డు భద్రత, ప్రయాణం చేసే టప్పుడు అనుచరించాల్సిన నిబంధనలు, సేఫ్టీ ప్రయాణం, హెల్మెట్ ధరించడం తదితర అంశాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన రవాణా శాఖ అధికారులు. తదనంతరం ఇందిరా సర్కిల్ లో విద్యార్థులు, వాహన చోదకుల చే ప్రతిజ్ఞ చేయించిన ఆర్.టి.ఓ. అధికారులు. ఈ కార్యక్రమం లో యం.వి. ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర, ఏ.యం.వి.ఐ. లు, స్థానిక ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, వాహన చోదకులు, ఆర్.టి.ఓ. కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News