నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష మదనపల్లె : తొలి పూజలు అందుకునే గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలని తెలుగుదేశం యువనేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి పండుగను బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.మండపాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి,భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు.పట్టణంలోని ప్రతివీధిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోందన్నారు.ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.స్వామివారి కృపాకటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని తద్వారా ప్రతి ఇంట ఆనందం వెల్లివిరయాలని ఆకాంక్షించారు.నిమజ్జనం కార్యక్రమాలు యువత జాగ్రత్తల పాటిస్తూ జరుపుకోవాలని ఆయన సూచించారు.హిందూ,ముస్లిం సోదరులు ఐకమత్యంతో గణేశుడి ఉత్సవాలను జరుపుకొని మతసామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
Reporter
Namitha News