నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నాటి ఉద్యమాల ఫలితంగానే మదనపల్లి జిల్లా సాకారం - ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హర్షం మదనపల్లె : నాటి ఉద్యమాల ఫలితంగానే మదనపల్లి జిల్లా సాకారమైందని ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) స్పష్టం చేశారు.ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.జిల్లాల పునర్విభజన కాకమునుపే మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తాము జిల్లా సాధనలో భాగస్వాములు కావడం జరిగిందన్నారు.అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జిల్లా సాధన సమితి నాయకులతో పాటు తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.తనపై ఏడు కేసులు పెట్టిందని ఆరోపించారు.అయినప్పటికీ తాము వెనక్కి తగ్గకుండా పోరాటాలు చేశామన్నారు.అయితే యువగళం పాదయాత్రలో ప్రస్తుతం మంత్రి నారా లోకేష్,ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసిందన్నారు.మంత్రివర్గ ఉప సంఘం మదనపల్లి జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు.త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లాపై అధికారిక ప్రకటన చేయనున్నారని,దీంతో దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరనున్నదని వెల్లడిం చారు.మదనపల్లి జిల్లా ఏర్పాటయితే పరిశ్రమలు ఏర్పాటై,ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని,వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు.నాడు మదనపల్లి జిల్లాపై వైసీపీ ప్రభుత్వం మాట తప్పితే,నేడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం మాట నిలుపుకుందని ప్రశంసించారు.అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాసనసభ సమావేశాల్లో మదనపల్లి జిల్లా ఆవశ్యకతపై గళం వినిపించారని కొనియాడారు.చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మదనపల్లి జిల్లా ఏర్పాటు కావడం సరికొత్త అధ్యాయమని,ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
Reporter
Namitha News