నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 15 : విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు గణేష్ యూత్ ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కుల మతాలకు అతీతంగా అన్నదానం చేయడం అభినందనీయమని విద్యుత్ శాఖ ఉద్యోగులను ఏడి గోవిందరెడ్డి ప్రశంసించారు. మంగళవారం ఐటిఐ గ్రౌండ్లో వినాయక యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, లైన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విద్యుత్ శాఖ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నదానానికి సహకరించిన ఏడి గోవింద్ రెడ్డిని గణేష్ యూత్ సభ్యులు దృశ్యాలవలు, మెమెంటో తో సత్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా గణేష్ యూత్ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, పురాతన కళలు ప్రదర్శనలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు అనంత్, ఇంతియాజ్, నాగేంద్ర, డి ఓ భాస్కర్, అమీన్, శ్రీకాంత్, సివి రమణ,గణేష్ యూత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News