Saturday, 12 September 2026 04:39:27 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు విడుదల

Date : 15 May 2026 06:00 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మదనపల్లె సమీపం అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ ప్రవేశాలకొరకై నిర్వహించిన మిట్స్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం రోజున యూనివర్సిటీ ప్రో చాన్సుల్లర్ నాదెళ్ల ద్వారకానాథ్ ఆన్లైన్ ద్వారా విడుదలచేశారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, సి.ఓ.ఈ డాక్టర్ సాయి కుమార్, సి.టి.ఓ సనత్ హెగ్డే, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతీ ప్రసాద్ తదితరులు విడుదల కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ మే 3 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఈ పరీక్షను సుమారు 13 సెంటర్లలో నిర్వహించినట్లు, సుమారు 5000 మంది కి పైగా విద్యార్థులు ఈ సెట్ ను రాసినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ తరుపున టాప్ 20 ర్యాంకేర్స్ కు మెరిట్ స్కాలర్షిప్ లు అందజేయనునట్లు ఆయన అన్నారు. ఈ పరీక్షలో మదనపల్లె కు చెందిన పఠాన్ జుల్ఫికర్ ఖాన్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ఆయన అన్నారు. పెదకాము రిషిత రెడ్డి కు రెండవ ర్యాంక్, నాసన్న గారి రామ్ చరణ్ రెడ్డి కు మూడవ ర్యాంక్, వాల్మీకి ఋషిక్ కు నాలగవ ర్యాంక్ పొందినట్లు ఆయన అన్నారు. ఎస్.ఎండీ. మోయిన్ కు ఐదో ర్యాంక్, పూటక హర్ష నందన్ కు ఆరవ ర్యాంక్, హెచ్.రవళిక కు ఏడవ ర్యాంక్, నల్లజాల రవిచంద్ర నాయుడు కు ఎనిమిదవ ర్యాంక్, గొర్లప్పగారి హాసిని కు తొమ్మిదవ ర్యాంక్, వేమల యతీష్ కు పదవ ర్యాంక్ లభించినట్లు ఆయన అన్నారు. కమ్ములూరి తబసుమ్, నవదీప్ తేజ, వి మహాలక్ష్మి, జయవర్ధన్ జె యెన్, కొండా భాను తేజ, విరూపాక్షి తేజస్విని, షేక్ సమీనా, కేసర్ల మురారి, షేక్ మహమ్మద్ జుబేర్, మరియు ఫసీహా ఫాతిమా పరికీ సయ్యద్ లు వరుసగా 11వ ర్యాంక్ నుంచి 20వ ర్యాంక్ వరకు నిలిచినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ యూనివర్సిటీ సెట్ రాసి టాప్ లో నిలిచిన టాప్ 20 విద్యార్థులకు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్ధి కి 100 శాతం ఫీజు స్కాలర్షిప్ నాలుగు సంవత్సరాలు అందజేస్తామని, ర్యాంక్ 2 నుంచి 5 వరకు విద్యార్థులకు 75% శాతం, ర్యాంక్ 6 నుంచి 10 వరకు విద్యార్థులకు 50% శాతం మరియు ర్యాంక్ 11 నుంచి 20 వరకు విద్యార్థులకు 25% శాతం ఫీజు స్కాలర్షిప్ లు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. మిట్స్ సెట్ రాసిన విద్యార్థులకు త్వరలోనే కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. టాప్ లో నిలిచిన విద్యార్థులను యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల అభినందనలు తెలియజేసారు. ఫలితాల విడుదల కార్యక్రమం లో హేమంత్ కుమార్, రియాజ్ అలీ పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :