Thursday, 30 July 2026 03:47:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు

పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Date : 21 May 2026 04:07 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ : సేవే లక్ష్యంగా పనిచేస్తున్న స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, ధాత్రి ఫౌండేషన్ సంస్థలు పలమనేరులో 30 మంది గిరిజనులు, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశాయి. పలమనేరు పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి అవకాశాలు లేక జీవనం కష్టతరంగా మారుతోందన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూలీ పనులు కూడా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సరుకులు రెండు నెలల పాటు ఉపయోగపడతాయని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి తిరుపతి నుంచి స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, మదనపల్లి నుంచి ధాత్రి ఫౌండేషన్ వచ్చి సహాయం అందించడం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. పలమనేరు మండలంలో ఈ సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ బృందం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి, శ్రీమతి విజయ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నారు. అవసరం, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి అవసరమైన వారికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :