Sunday, 13 September 2026 04:40:17 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు

Date : 12 December 2025 10:58 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - డిసెంబర్ 12 : చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకురాలు శ్రావణి స్వయంభు శ్రీ వైష్ణవి దేవి, అభయాంజనేయ స్వామి, నాగభైరవ స్వాములకు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టమి ప్రత్యేకతగా నాగభైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించారు. కుజదోషం, సర్పదోషం నివారణకు, వివాహం కాని వారు, సంతానం కోరిక ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న భక్తులు అష్టమి రోజున పంచదీపారాధన చేయడం శ్రేయస్కరమని ఆలయ అర్చకురాలు తెలిపారు. చౌడేపల్లి, పుంగనూరు, మదనపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీకాంత్, ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా సేవలు అందించారు. ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: