Sunday, 13 September 2026 10:59:59 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు

Date : 03 December 2025 04:29 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు... మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలు స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు... స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడాల్లి నుండి పెద్ద ఎత్తున మేల తాళాలు, బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు... ఎన్విఆర్ కళ్యాణమండపంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్లు, పట్టణ ప్రముఖులు, ముఖ్య అతిథులు సభలో ప్రసంగించారు.. వందేళ్లు ఒక మునుపు 30 మంది సభ్యులు 400 రూపాయలతో ప్రారంభించిన మదనపల్లి టౌన్ బ్యాంక్ నేడు 125 కోట్ల డిపాసిట్లు, 100 కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలోని గుర్తింపు కలిగిన బ్యాంకుగా పేరు సంపాదించుతుందని అన్నారు.. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లె ను జిల్లాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలియజేశారు.. రానున్న కాలంలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి టౌన్ బ్యాంకు మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు... ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ సీఈవో ప్రసాద్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :