నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 17 : ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె భారత చరిత్రలో ఒక విశిష్ట స్థానం కలిగిన పట్టణం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన "జన గణ మన" జాతీయ గీతాన్ని ఆయన స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి, దానికి స్వరరూపం బాణీ కట్టిచ్చిన చారిత్రక ప్రదేశం ఈ మదనపల్లె. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ అపూర్వ వారసత్వం దేశానికి గర్వకారణం. అయితే, ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్పటికీ మదనపల్లెకు అయన బస చేసిన ప్రాంతం తగిన స్థాయిలో అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం మరియు జాతీయ గుర్తింపు లభించలేదు. అందువల్ల, మీరు దయచేసి క్రింది అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వినమ్రంగా కోరిన మదనపల్లి బిజెపి నాయకులు. మదనపల్లె పట్టణం లో ఠాగూర్ గారు బస చేసిన ప్రాంతంను జాతీయ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. జాతీయ గీత చరిత్రను ప్రతిబింబించే స్మారక భవనం, మ్యూజియం మరియు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సంబంధించిన చారిత్రక ప్రాంతాలను సంరక్షించి అభివృద్ధి చేయాలి. రహదారులు, రైల్వే, పర్యాటక వసతులు మరియు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మదనపల్లెకు ఆ ప్రాంతం ని విశేష గుర్తింపు తీసుకురావాలి. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఈ పవిత్ర ప్రాంత అభివృద్ధికి మీ నాయకత్వంలో ప్రత్యేక నిధులు కేటాయించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించిన అన్నమయ్య జిల్లా బీజేపీ కార్యదర్శిబర్నే పల్లె రవికుమార్ , బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, బిజెపి నాయకులు కృష్ణయ్య, వర్మ, పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News