Sunday, 13 September 2026 06:54:54 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో 19వ వర్ధంతి

19 సంవత్సరాల నుండి ఆర్టీసీ డిపో ఉసెత్తని అధికార,ప్రతిపక్ష పార్టీలు అంటూ ధ్వజమెత్తిన సిపిఐ.,ఏ ఏఐటీయుసి, కాంగ్రెస్ నాయకులు

Date : 31 December 2025 06:56 PM Views : 317

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 31 : లాబాల బాట లో నడుస్తున్న బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో ను 19 సంవత్సరాల క్రితం అర్థంతరంగా ముసివేసిన ఆర్.టి.సి. యాజమాన్యం. అప్పటి పాలకుల ఒత్తిడి మేరకు డిపో ను ముసివేసి నేటికీ 18సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పాలకులు, ప్రతిపక్ష పార్టీలు డిపో ఊసే ఎత్తకుండా మిన్నకుండారంటూ, ఏద్దేవా చేస్తున్న సిపిఐ, ఏఐటియుసి, కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు మునుపు యువగలం పాదయాత్ర లో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. లాభాల బాటలో ఉన్న బి కొత్తకోట ఆర్టీసీ డిపోను మూసివేసి మదనపల్లెకు తరలించిన దుర్ధినాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు సిపిఐ, కాంగ్రెస్, ఏఐటియుసి తదితర రాజకీయ పార్టీలు మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బి.కొత్తకోట ఆర్టీసీ డిపో 19వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ డిపోను తరలించే సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల దినపత్రికల క్లిప్పింగ్ లతో కూడిన బ్యానర్ ను ప్రదర్శిస్తూ, ఆర్టీసీ బస్సు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి నశించాలని,వెంటనే బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపోను ప్రారంభించాలని నినాదాలు చేశారు.డిపోను మూసివేసి అప్పుడే 19 సంవత్సరాలు అయిందా అని పట్టణ ప్రజలు చర్చించుకోవడం,వర్ధంతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించడం కొసమెరుపు. ఈ కార్యక్రమాన్నుద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి,సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,సిపిఐ మండల కార్యదర్శి జి. రఘునాథ్ లు ప్రసంగిస్తూ;2006 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నష్టాల సాకుతో 14 డిపోలను మూసివేసిందని,అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో 14 డిపోలలో ఒక్క బి.కొత్తకోట తప్ప మిగిలిన13 డిపోలు తిరిగి ప్రారంభించారని అన్నారు. పార్టీలు మారుతున్నాయి తప్ప ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేకపోవడం బాధాకరమైన విషయమని,ఎటువంటి అర్హతలు లేకున్నా బి.కొత్తకోటను నగర పంచాయతీ చేసిన గత వైసిపి నాయకులు ఆర్టిసి డిపో ఏర్పాటు చేస్తున్నామని తూతూ మంత్రంగా ఎన్నికల ముందు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.యువగలం పాదయాత్రలో బి.కొత్తకోట ఆర్టీసీ డిపోను పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని,ఆ హామీకి కట్టుబడి ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చ రించారు.బి.కొత్తకోటలో అసమర్ధ నాయకుల వల్లనే ఆర్టీసీ డిపోను కోల్పోయామంటూ నాయకులు ధ్వజమెత్తారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం,బీజీపీ,జనసేన,ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమిగా అధికారంలోఉన్నారని,ఇప్పుడైనా డిపో ఏర్పాటు చేయడంలో వారి అధినాయకత్వాలకు విన్నవించి ఆర్టీసీ డిపో పునరుద్ధరణకు కృషి చేయాలని హితవు పలికారు.లేకపోతే కలిసొచ్చే రాజకీయ పార్టీలు మరియు కులసంఘాలు,ప్రజా సంఘాలు,వ్యాపారస్తులు,విద్యార్థులు,చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అలీ,ఏఐటియుసి మండల అధ్యక్షులు యస్.తంబయ్యశెట్టి,జిల్లా నాయకులుబి.వేణుగోపాల్ రెడ్డి,యస్.సలీంబాషా,జవహార్ బాబు,వేమనారాయన,నారాయణస్వామి,గంగులప్ప,దుమ్ము.బాబు,రామచంద్ర,హబీన్,కిట్టన్న,గంగాద్రి, రెడ్డప్ప,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :