Sunday, 13 September 2026 07:58:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కాంక్రీటు మిల్లర్ బోల్తా - తెగిన కార్మికుడి చేయి

మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కు తరలింపు

Date : 25 May 2026 07:33 PM Views : 135

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంక్రీటు మిల్లర్ బోల్తా.. కార్మికుడి చేయి తెగింది పరిస్థితి విషమం.. బెంగళూరుకు తరలింపు మదనపల్లెలో భవన నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదంలో ఓ యువ కార్మికుడు తీవ్రంగా గాయపడి ఎడమ చేయిని కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కాంక్రీటు మిల్లర్ బరువును మట్టి దిమ్మెలు తట్టుకోలేక కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. పట్టణంలోని గొల్లపల్లెకు చెందిన రమేష్ కుమారుడు పవన్ కళ్యాణ్ కాంక్రీటు మిల్లర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. స్థానిక ఎంఎల్‌ఎల్ ఆస్పత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో సెల్లార్ పనుల భాగంగా పిల్లర్ కాంక్రీటు వేస్తుండగా ప్రమాదం జరిగింది. మిల్లర్ నిలిపిన ప్రదేశంలోని మట్టి చరియలు ఒక్కసారిగా విరగడంతో భారీ యంత్రం ఒరిగిపోయి గునాదులు తీసిన లోయలో పడింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మోల్డింగ్ కమ్మీలపై మిల్లర్ పడిపోవడంతో పవన్ కళ్యాణ్ ఎడమ చేయి ఇనుపరాడ్ల మధ్య ఇరుక్కుపోయి మోచేయి భాగం తెగిపోయింది ప్రమాదాన్ని గమనించిన సహచర కార్మికులు వెంటనే పవన్ కళ్యాణ్‌ను ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం అనంతరం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఇదిలా ఉండగా ఇనుపరాడ్లలో ఇరుక్కుపోయిన చేయి భాగాన్ని కార్మికులు బయటకు తీసి వైద్యుల సూచన మేరకు ఐస్ బాక్స్‌లో ఉంచి బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ఇంజనీర్ వైఫల్యం, మేస్త్రీ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :