Monday, 14 September 2026 09:12:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం

Date : 19 April 2026 06:17 PM Views : 292

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముగిసిన క్రీడాభారతి అన్నమయ్య జిల్లా కబడ్డీ పోటీలు -- విజేతలుగా నిలిచిన జట్లకు ట్రోఫీల ప్రదానం మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కబడ్డీ పోటీలు ఆదివారంతో ముగిశాయి. కబడ్డీ క్రీడా పోటీలను అన్నమయ్య జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి నరేష్ బాబు, బిజెపి ప్రధాన కార్యదర్శి పులి నరేంద్ర కుమార్ రెడ్డి, రన్ టీవీ డైరెక్టర్ సిరివేలు చరణ్ కుమార్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, కబడ్డీ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ క్రీడా పోటీలలో జిల్లా నలుమూలల నుండి అండర్ 14, 17, 19 విభాగాలలో బాలబాలికల క్రీడాకారులు ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని ప్రతిభ చూపారు. అండర్ 14 విభాగంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు, అండర్ 17 విభాగంలో కలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అండర్ 19 విభాగంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి విజేతలుగా నిలిచారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్, రాష్ట్ర కురుబ సంఘం డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాటకొండ గురు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించి చురుగ్గా క్రీడల్లో పాల్గొంటారని, ఆటలు ఆడడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారన్నారు. 2036లో జరిగే ఒలింపిక్స్ పోటీలలో కబడ్డీ క్రీడను కూడా చేర్చాలని, అందులో అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి క్రీడాకారులు పాల్గొనేలా శిక్షణ తీసుకోవాలని తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. క్రీడాకారుల బహుమతులను జివీఎస్సిఎస్ సొసైటీ ఫౌండర్ జి.శ్రీధర్ కుమార్ సమకూర్చారని అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సభ్యులు శ్రీకాంత్, రమేష్, క్రీడాభారతి ఉపాధ్యక్షులు విష్ణు చైతన్య, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ మిమిక్రీ రామమూర్తి, క్రీడాభారతి మదనపల్లె శాఖ అధ్యక్షులు బాలాజీ, షూటింగ్ బాల ఆసియన్ గోల్డ్ మెడలిస్ట్ యూసఫ్ బాషా, క్రీడా భారతి సభ్యులు మురళి, కిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ, లత, భారతి, శరత్, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: