Wednesday, 29 July 2026 02:41:37 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

Date : 05 December 2025 09:01 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 05 : రామసముద్రం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన తాహిసీల్దార్ మహ్మద్ అజారుద్దీన్, ఎం ఈవో హేమలత, ఆంజనేయులు, హెచ్ ఎం లు, మునిస్వామి నాయక్,చిట్టిబాబు, హేమలత, వెంకటరమణ నాయుడు, కె. రమేష్ బాబు, వెంకటచలపతిరాజు, మెడికల్ ఆఫీసర్ జాహ్నవి,పాఠశాల కమిటీ చైర్మన్ లు కూటమి నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు, వీరికి ఘన స్వాగతం పలికారు. స్వాగతకార్యక్రమంలో విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ రోజు విద్యార్థులే రేపటి భవిష్యత్తు మీరు బాగా చదివితే డాక్టర్, ఇంజనీర్, టీచర్, పోలీస్ లు వంటి ప్రతిష్టాత్మక స్థానాలు సంపాదించి మీ తల్లి దండ్రులు, గురువులకు, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలాన్నారు. కూటమి ప్రభుత్వ రాకతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా& ఐటీ శాఖామంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజాహాన్ బాషా ఆలోచనా విధానంతో రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పరిగెడుతుందని కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తూ పిల్లల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిందన్నారు. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు సలహాలతో వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని కూటమి ప్రభుత్వం పాఠశాలవిద్యార్ధులకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టివారి తల్లిదండ్రులకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తుందన్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు.ఈకార్యక్రమాల్లో పాల్గొన్నా సీతారామస్వామి, పెద్దిరెడ్డి,స్థానికం రాజేష్, శివశంకర,రెడ్డెప్పరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బి. నారాయణ, మట్లవారిపల్లె కిట్ట, బాలాజీ, నాగరాజు, శ్రీనివాసులు, సుబ్బు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: