Saturday, 12 September 2026 05:34:30 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో బీటెక్ ప్రవేశాలు ప్రారంభం

ఈఏపీసెట్ ర్యాంకర్లకు సువర్ణ అవకాశం

Date : 03 July 2026 07:38 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జులై 03 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి ఈఏపీసెట్ (EAPCET) ద్వారా బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నామని, వారి ర్యాంకుకు అనుగుణంగా తక్కువ ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే సువర్ణ అవకాశాన్ని మిట్స్ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి యూనివర్సిటీలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డేటా సైన్స్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్), కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) లు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఆధునిక పాఠ్య ప్రణాళిక, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, పరిశోధనకు ప్రాధాన్యత మరియు అత్యుత్తమ ప్లేస్‌మెంట్ సదుపాయాలతో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తోందని డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి తెలిపారు. ఈఏపీసెట్ అర్హత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యూనివర్సిటీని నేరుగా సందర్శించి కోర్సులు, ఫీజు రాయితీలు మరియు ప్రవేశాల వివరాలను తెలుసుకొని వెంటనే అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రో ఛాన్సలర్ శ్రీ నాదెళ్ల ద్వారకానాథ్, వైస్ ఛాన్సలర్ (ఇన్‌చార్జ్) డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :