Sunday, 13 September 2026 04:31:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గౌరవప్రదమైన ఉద్యోగాన్ని జాతి కోసం త్యాగం

వడ్డెర సంక్షేమానికి అలుపెరగని పోరాటం - రాష్ట్ర వడ్డెర సేవాదళ్ సంఘ రాష్ట్ర సలహాదారు బత్తల రమణ

Date : 21 June 2026 08:38 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 21 : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆరులో చాచే ఈ ఆధునిక సమాజంలో తన ప్రతిభతో వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా త్యజించి దశాబ్దాలుగా అణగారిన వడ్డెర జాతి సంక్షేమం కోసం నడుం బిగించిన ఓ యువ నాయకుడి కథాంశం. పెద్దమండెం మండలం బండమీద పల్లి పంచాయతీ తురకపల్లెకు చెందిన బత్తల రమణ 2000 సంవత్సరంలో ఆయనకు టీచరుగా ఉద్యోగం అవకాశం వచ్చింది. టీచరుగా పనిచేస్తున్నా ఆయన ఆలోచన విధానాలు సమాజంలో తన వడ్డెర జాతి దశాబ్దాలుగా అణగారిన బతుకులతో కనీసం తమ బిడ్డలను పోషణ, చదివించుకొనే స్థాయి లేకపోవడం ఆయనను తీవ్రంగా ఆలోచింపజేసింది. తన జాతి అన్ని రంగాలుగా అభివృద్ధి చెంది సమాజంలో విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి తలెత్తుకునేలా చూడాలని సంకల్పించి 2003లో తన టీచర్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని వడ్డెర సమాజ సేవకు దృఢ సంకల్పంతో ముందుకు నడిచాడు. బత్తల రమణ చేసిన త్యాగం వడ్డెర సమాజం కోసం పడుతున్న సామాజిక స్పృహకు సహచర వడ్డెర కులస్తులు ఆయనకు అన్ని విధాల అండగా నిలిచి ప్రోత్సాహం అందించారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో నాటినుండి వెనుతిరగకుండా వడ్డెర సమాజ సేవలో దూసుకు వెళుతున్నాడు.ఈ సందర్భంగా గత కొన్నాళ్లుగా జిల్లాలోని వడ్డెర కుటుంబాలను సందర్శించి వారు పడుతున్న కష్ట నష్టాలను కళ్ళారా చూసి చెలించి తనకున్నంతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సాయం, కష్టాల్లో ఉన్న పేదలకు తనవంతు సహాయంతో పాటు వారికి అండగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతింతై వటుడింతై చందాన బత్తల రమణ అంచలంచెలుగా వడ్డెర సమాజానికి తన వంతు చేస్తున్న సేవలను రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు, సభ్యులు గుర్తించి బత్తల రమణను ఏకంగా రాష్ట్ర వడ్డెర సేవాదళ్ సంఘం రాష్ట్ర సలహాదారునిగా నియమించడం ఆయన చేసిన వడ్డెర సమాజ సేవకు నిలువెత్తు నిదర్శనం. బత్తల రమణ తనకు అప్పగించిన వడ్డెర సంఘం రాష్ట్ర పదవికి న్యాయం చేస్తూ ప్రతినిత్యం వడ్డెర సమాజ సేవలో భాగంగా వడ్డెరలను చైతన్య పరుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేస్తూ సమాజంలో వడ్డెర బిడ్డలు ఆర్థిక స్థితిపై స్పందించి వారిని ఆర్థికంగా ఆదుకుంటూ ఎక్కడ వడ్డెర కులస్తుల సమస్యలు వస్తే వెంటనే వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు సహకారంతో పరిష్కారానికి మేమున్నామంటూ అండగా నిలిచి ఆదుకుంటూ వస్తున్నాడు. జిల్లావ్యాప్తంగా వడ్డెర సంఘాల బలోపేతం తో పాటు వారి ఆర్థిక స్థితిగతులు, విద్య పరంగా విద్యార్థుల సమస్యల పై ప్రత్యక్ష పర్యటనలతో వారి సమస్యలను క్రోడీకరించి పరిష్కారం చేసి సమాజంలో వడ్డెర బిడ్డలు తలెత్తుకొని జీవించేలా ఓ ప్రణాళిక బద్ధం గా అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని రాష్ట్ర వడ్డెర సేవాదళ్ సంఘం సలహాదారు బత్తల రమణ విలేకరులకు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :