Thursday, 30 July 2026 12:30:54 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం - తహసీల్దార్ రాము

Date : 30 December 2025 05:53 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలో మంగళవారం ముడి పాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల అవగాహన ఎంతో కీలకమని ఆయన అన్నారు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని చెప్పారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు ఏర్పడకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు పొందారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :