Sunday, 13 September 2026 05:53:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి

Date : 05 June 2026 05:42 PM Views : 285

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి జూన్ 7 నుంచి 21 వరకు విస్తృత యోగా కార్యక్రమాలు... జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7 నుంచి 21 వరకు నిర్వహించనున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యోగాంధ్ర–2026 కార్యక్రమాల నిర్వహణపై మదనపల్లి సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆయుష్ శాఖ అధికారులు, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, డీఆర్‌డీఏ, డ్వామా, జిల్లా పర్యాటక శాఖ, ఐసీడీఎస్, జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్, జిల్లా క్రీడాశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సమగ్ర మార్గమని తెలిపారు. యోగా ద్వారా శరీరానికి బలం, సమతుల్యత పెరగడంతో పాటు మనస్సు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలు, పౌరుల నమోదు, యోగా ప్రదర్శనలు, యోగా పోటీలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి ఐదు ప్రధాన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. జూన్ 6, 7 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణలు నిర్వహించడంతో పాటు జూన్ 8 నుంచి 12 వరకు యోగా శిక్షకులకు శిక్షణలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్ 9 నుంచి 17 వరకు శిక్షకుల ద్వారా పౌరులకు యోగా శిక్షణలు నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విస్తృత స్థాయిలో పౌరుల నమోదు చేపట్టి యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించనున్నట్లు వివరించారు. జూన్ 7 నుంచి 20 వరకు థీమాటిక్ యోగా, టూరిస్ట్ యోగా, టెంపుల్ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా రోడ్లను గుర్తించి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యోగాపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆసనాలు, ప్రాణాయామం, సింక్రొనైజ్డ్ యోగా, క్విజ్, నినాదం, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి పోటీలు జూన్ 7 నుంచి 9 వరకు, మండల స్థాయిలో జూన్ 10 నుంచి 12 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 14 నుంచి 16 వరకు, రాష్ట్ర స్థాయిలో జూన్ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న అమరావతి వెస్ట్ బైపాస్ వద్ద 25 వేల మంది పాల్గొనే రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో వెయ్యి మంది పౌరులతో జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కూడా భారీ ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతి కోర్‌కు జిల్లా నోడల్ అధికారులను, మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించి కార్యక్రమాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్ర–2026ను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :