నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలకు చెందిన వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు మరోసారి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు, పద్మావతి ల ఆధ్వర్యంలో వేలం పాటలకు సిద్ధం కాగా వేలంపాటదారులు, ప్రజలు గత వేలం పాటలలో ఉన్న బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే వేలంపాటలు నిర్వహించాలని నిలదీశారు. కొన్నేళ్లుగా పంచాయతీలకు రావాల్సిన బకాయిలు రాకుండా వేలం పాటలు నిర్వహించరాదని వేలంపాటదారులు బాయ్ కాట్ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పంచాయతీ వేలం పాటలను మరోసారి వాయిదా వేయక తప్పలేదు
Reporter
Namitha News