Saturday, 12 September 2026 04:34:53 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం -- పోలీసులకు ఫిర్యాదు

Date : 19 December 2025 06:22 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం -- పోలీసులకు ఫిర్యాదు అభం, శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె మండలం లో జరిగింది. బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మదనపల్లె మండలం, వలసపల్లె పంచాయతీ, కట్లాటపల్లి కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేరు. అవ్వ చెంతనే ఉంటోంది. అవ్వే కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివించుకుంటోంది. ఈ క్రమంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి ని స్థానికంగా ఉన్న వరుణ్ అనే యువకుడు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, నోటికి గుడ్డకుక్కి అత్యాచారం యత్నం చేస్తుండగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడు. కూలుపనుల్లో ఉన్న అవ్వకు విషయం తెలియగానే పరుగుపరుగున ఇంటికి చేరుకుంది. చిన్నారి అవ్వ వెంటనే గ్రామస్తులతో కలిసి మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు లేని చిన్నారిపై అఘత్యానికి పాల్పడి‌న యువకున్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విచారించి నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేస్తామని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సీఐ కు ఫిర్యాదు చేస్తున్న కాట్లాటపల్లి గ్రామస్థులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :