Monday, 14 September 2026 09:50:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

స్వర్ణంద్ర గా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్నా కలెక్టర్ నిశాంత్ కుమార్

క్లీన్ స్వీప్ కార్యక్రమం లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మూడు మునిసిపాలిటీ లో మదనపల్లి కి దక్కడం పై కలెక్టర్ హర్షం

Date : 18 July 2026 04:20 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 18 : స్వర్ణంద్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా నేడు రాయచోటి పట్టణం లోని శెట్టిపల్లి డంపింగ్ యార్డ్ వద్ద మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో జరగుతున్న కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మెటీరియల్ రికవరీ ఫెసలిటి ని ప్రారంభించిన అనంతరం ఘన వ్యర్థల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన క్లీన్ స్వీప్ కార్యక్రమం లో మదనపల్లి మునిసిపాలిటీ కి రాష్ట్ర వ్యాప్త అవార్డు రావడం తో హర్షం వ్యక్తం చేస్తూ పరిశుభ్రత అనేది ప్రభుత్వ కార్యక్రమం గా భావించకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గా భావించి రాష్టాన్ని స్వర్ణ ఆంధ్ర గా తీర్చిదిద్దుకొందామని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రాయచోటి డంపింగ్ యార్డు వద్ద ప్రారంభించిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రాయచోటి మున్సిపాలిటీలో రోజుకు సుమారు 60 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని, వాటిలో ప్లాస్టిక్, రబ్బరు తదితర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగానికి పంపించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రోజుకు 20 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రాయచోటిలో ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన పూర్తి మౌలిక వసతులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (FSTP) నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ కనెక్షన్ అందిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగాచౌడేపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని, గుర్రంకొండలో మరో గోవర్ధన్ ప్లాంట్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల ద్వారా పశువుల పేడతో పాటు ఇతర జీవ వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చే అవకాశం ఉంటుందని తెలిపారు. పరిశుభ్రతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ నిరంతరం భాగస్వాములై అన్నమయ్య జిల్లాను పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు

ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :