Sunday, 13 September 2026 03:49:29 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

సిపిఐ శతాబ్ధి ముగింపు ఉత్సవాలు కరపత్రాలు విడుదల

ఖమ్మం లో జనవరి 18వ తేదీ ముగింపు సభ ను జయప్రదం చేయండి- సిపిఐ అన్నమయ్య సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 11 January 2026 07:51 PM Views : 380

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జనవరి 11 : జనవరి 18వ తేదీ ఖమ్మం నగరం నందు సిపిఐ శతాబ్ది ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు ఈసందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 2026 జనవరి 18 న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగసభ జరుగుతున్నదని పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు* *1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) భారత గడ్డపై వందేళ్ళు పూర్తి చేసుకుంటున్నదాని. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ (సిపిఐ) శత వసంత ఉత్సవాలు పార్టీ ఆవర్భవించిన కాన్పూర్ 2024 డిసెంబర్ 26న ప్రారంభమై దేశ వ్యాపితంగా ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయనీ. బ్రిటీష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారు, కాన్పూర్, మీరట్, పెషావర్ తదితర కుట్ర కేసులు పెట్టి నాయకులను జైళ్ళలో నిర్భందించారు. అయినప్పటికీ కార్మిక, విద్యార్ధి, యువజన, రైతు, మహిళా తదితర ప్రజా సంఘాలను నిర్మించి వెట్టిచాకిరి విముక్తి కొరకు, కార్మికులు, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సి.పి.ఐ. నిర్వహించింది. ఈ శతాబ్దకాలంలో ఎన్నో పోరాటాలు, ఎనెన్నో త్యాగాలు ఎంతో మంది అమరవీరుల రక్త తర్పరణతో ఎన్నెన్నో విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సి.పి.ఐ. తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది* భూమికోసం, భుక్తికోసం నిరంకుశ నిజాంను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేలమంది ప్రాణ త్యాగాలతో, మూడువేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాలభూమిని పంచిన చరిత్ర భారత కమ్యునిస్టుపార్టీది. పున్నప్రవాయిలర్, తెభాగ లాంటి వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యునిస్టు పార్టీది. ఫలితంగానే పాలకులు భూసంస్కరణ చట్టం, గరీభీహఠావో, బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలను చేయాల్సివచ్చింది. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది కమ్యూనిస్టుపార్టీ అని తెలిపారు ఈకార్యక్రమ సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప సహాయ కార్యదర్శి ఎస్ నిజాముద్దీన్ ‌ చంద్ర లక్ష్మన్న చౌడప్ప శంకరమ్మ రమణమ్మ రామప్ప ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :