Sunday, 13 September 2026 06:10:27 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు

ఇంచార్జ్డి జాయింట్ కలెక్టర్, డి .ఆర్.ఓ. మధుసూదన్ రావ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 March 2026 02:52 PM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 18 : మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన ఐదేళ్ల పదవీకాలం 2021 మార్చి 18 నుండి 2026 మార్చి 17 సాయంకాలం వరకు కొనసాగి, నిర్ణీత గడువు నాటికి పూర్తయినది.ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన దృష్ట్యా, పరిపాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో పరిపాలన బాధ్యతలను తాత్కాలికంగా ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించనున్నది. ఈ క్రమంలో మదనపల్లి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావు నియమితులయ్యారు. బుధవారం ఉదయం మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు

ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మదనపల్లి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ వంటి మౌలిక సేవలలో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అలాగే నగర అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ పరిపాలన పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని వెల్లడించారు

ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఇన్చార్జి జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ రావ్ కు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బంది, అధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :