Monday, 14 September 2026 07:43:21 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నిబంధనలు ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలి

ఎక్సైజ్ మంత్రికి బహుజన యువసేన వినతి పత్రం

Date : 13 February 2026 04:48 PM Views : 292

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పట్టణంలో పలు బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు ప్రభుత్వ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు జి. పునీత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని నరసింహా బార్ అండ్ రెస్టారెంట్‌తో పాటు మరికొన్ని మద్యం దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బార్ వెనుక ద్వారం గుండా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, సమీపంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రుల వల్ల విద్యార్థులు, రోగులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం సమీపంలో మద్యం సేవించి అపరిశుభ్రం చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గతంలో ఫిర్యాదులు, పత్రికా కథనాలు వచ్చినా చర్యలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పునీత్ కుమార్, ప్రజారోగ్యం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత బార్‌ను వెంటనే తొలగించడంతో పాటు నిబంధనలు అతిక్రమిస్తున్న ఇతర మద్యం దుకాణాలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన యువసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :