Tuesday, 15 September 2026 08:52:33 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

చరిత్రను తెలుసుకోవడం.. కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

Date : 17 May 2026 07:13 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చరిత్రను తెలుసుకోవడం.. కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేయాలి భారతదేశ చరిత్ర అత్యున్నతమైనదని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా అనేక చారిత్రక కళాఖండాలు, పురావస్తు సంపదలు ఉన్నాయని పురావస్తు విద్యార్థి మునీంద్ర పేర్కొన్నారు. మే 18న జరగనున్న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రను తెలుసుకోవడం, భావితరాలకు కాపాడి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భారతదేశ ఆవిర్భావం నుంచి ఆదిమానవుల జీవన విధానం, వివిధ తెగల సంస్కృతులు, రాజ్యాల పాలనా విధానాలు, రాజులు ఉపయోగించిన ఆయుధాలు, పనిముట్లు, ఆచార సంప్రదాయాలు వంటి ఎన్నో చారిత్రక ఆధారాలను మ్యూజియంలు ప్రజలకు అద్దం పట్టే కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. మానవ నాగరికత పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుత తరం విద్యార్థులు చరిత్రపై అవగాహన పెంపొందించుకోవాలంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా మ్యూజియంలను సందర్శించాలని సూచించారు. మ్యూజియంల ద్వారా విద్యార్థులు చరిత్రను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, వారసత్వ సంపద పట్ల గౌరవ భావన పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక చరిత్ర, జానపద సంస్కృతి, పురాతన కళాఖండాలు, శిల్పాలు, శాసనాలను ఆయా జిల్లాల మ్యూజియంలలో భద్రపరిస్తే భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మ్యూజియంల అభివృద్ధి ద్వారా పర్యాటక రంగంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మునీంద్ర తెలిపారు. చరిత్రను పరిరక్షించడం అంటే దేశ సంస్కృతిని కాపాడుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :