నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట- నవంబర్ 20 : అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. అనంతరం మేడా అంకమ్మ 76,736, నర్సాపురం యానాదయ్య 56,441, ఆవుల లక్ష్మీదేవి 13,350, షేక్ పారిజాన్ 1,43,502, డేరంగుల లక్ష్మీదేవి 41,400, తప్పేన రామయ్య 11,000, షేక్ మస్తాన్ Death / షేక్ రహమత్ బి 29,162,D.రెహమాన్ ఇషాక్ 76,358, కందుకూరి శ్రీనివాసాచారి 27,219, చౌడమ్ మహేశ్వర్ 35,000, కాలూరి అమీర్ భాష 85,000, అక్క రాజు పార్థసారథి 18,000,వెలిగండ్ల నాగమణి 66,935, బండారు కృష్ణయ్య 80,000, మాస సావిత్రమ్మ 25,000, పెద్దినేని శ్రీరాములు 1,00,567, సోమర్ మల్లేషమ్మ 81,000, లక్ష్మాపురం నాగజ్యోతి 25,000, భీమిశెట్టి ఆదిలక్ష్మి 1,50,843, నాగలపాటి శంకరమ్మ 25,000 గార్లకు సంబంధించి ₹11,67,513 ల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మేడికొండు రవికుమార్ నాయుడు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్,యూనిట్ ఇంచార్జ్ తేజాల ఆనంద్,తెలుగు యువత రాష్ట్ర నాయకులు రాంనగర్ నరసింహ,పాండురాజు,సిద్ధవటం నాగ మునిరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దగ్గుపాటి వెంకటేశ్వర్లు,దాసరి కళాధర్,ఎన్ సురేందర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ,తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News