Monday, 14 September 2026 10:41:11 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నేను ఓ మధ్యతరగతి రైతు బిడ్డనే అర్థం చేసుకోండి - సబ్ కలెక్టర్

ఏపీఐఐసీ రైతుల తో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి భేటీ, ససేమిరా అన్న రైతులలు

Date : 19 February 2026 10:21 PM Views : 312

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండల పరిధి లోని కుక్కరాజుపల్లి వద్ద ప్రభుత్వం ఏపీఐఐసీ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రెండు మాసాల క్రితం భూసేకరణ చేపట్టారు. ఈ భూ సేకరణ పై స్థానిక రెడ్డి కోట, కుక్కరాజు పల్లె పంచాయతీలకు చెందిన కుక్క రాజు పల్లి దళితువాడ, పర్ల గొల్లపల్లి, ఈర్లవాండ్లపల్లి, రెడ్డి కోటకు చెందిన బిసి, ఎస్సీ వర్గాలకు చెందిన రైతులు తమకు జీవనాధారమైన భూములు ఇవ్వమని గత రెండు మాసాల క్రితం కడప-మదనపల్లి జాతీయ రహదారిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమ భూములు లేకుంటే మేము జీవనాధారం కోల్పోతామని ఆత్మహత్యే శరణ్యమని బాధిత రైతులు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు లిఖిత పూర్వపు ఫిర్యాదులతో వారి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయమై గురువారం తాసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఏపీఐఐసీ భూముల రైతులతో మరోమారు భూములకు పరిహారం చెల్లింపు విషయమై సమీక్ష జరిపారు. నేను కూడా ఓ రైతు బిడ్డ నే మీకు న్యాయం చేయడానికి వచ్చానని రైతుల భూములకు పరిహారం సకాలంలో అందడంలో సహకరిస్తామని, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరిగితే పలు కంపెనీలు నిర్మాణం జరిగి అభివృద్ధి జరుగుతుందని తద్వారా మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు, స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులు పెద్ద మనసుతో ఆలోచన చేయాలని నచ్చ చెప్పారు. రైతులు మా పెద్దల నుండి మా ప్రాణం తో సమానంగా చూసుకుంటున్న మా భూములను ఇచ్చేది లేదని తమ వాదన వినిపించి ససేమిరా అన్నారు.అయితే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మొత్తం 46ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి గుర్తించి సర్వేకి ఆదేశించారు. ఈ భూముల విషయమై ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని రైతులు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలని ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో మంచి జరుగుతుందని మరోమారు రైతులను కోరినా వారు వినిపించుకోలేదు. ఇక సబ్ కలెక్టర్ మీ మంచి కోసం నేను చెప్పేది చెప్పాను ఇక మీ ఇష్టం అని చెప్పి సమావేశం ముగించారు. ఈ సమావేశంలో తాసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, కుక్కరాజుపల్లి, రెడ్డి కోట కు చెందిన రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: