Sunday, 13 September 2026 11:02:41 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలి - జిల్లా కలెక్టర్

వికసిత్ భారత్ జి-రామ్-జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలి మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక

Date : 05 January 2026 11:18 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 05: మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం ద్వారా 09 మరియు 10వ తరగతి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు మెరుగుపడాలని, వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని వినియోగించుకొని జిల్లాలోని చిన్న తరహా నీటిపారుదల చెరువులను నింపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... మదనపల్లి సబ్ కలెక్టర్ రాయచోటి మరియు పీలేరు ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తాసిల్దార్లు, హౌసింగ్ తదితర శాఖల సిబ్బందితో... మై స్కూల్ మై బ్రైడ్ వికసిత్ భారత్ జి రామ్ జి పి జి ఆర్ ఎస్ ద్వారా అందే అర్జీల పరిష్కారం జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులకు భూసేకరణ రీ సర్వే స్వామిత్వ స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్... మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమం పై సమీక్షిస్తూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న గెజిటెడ్ అధికారులు ఆయా పాఠశాలల్లో 9 మరియు 10 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు గెజిటెడ్ అధికారులు రోల్ మోడల్ గా నిలిచి అభ్యసన ఫలితాలను పెంచాలన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే ఆసక్తిని పెంచాలని ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. జిల్లా పాలన యంత్రాంగం రూపొందించిన ఏఎన్ఎం విస్తా మొబైల్ అప్లికేషన్ లో సంబంధిత గెజిటెడ్ అధికారులు వారికి కేటాయించబడిన పాఠశాలల తనిఖీ, అభ్యసన వివరాలు తదితర అంశాలను పొందుపరచాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలపై సమీక్షిస్తూ... ప్రజలకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని ఆదేశించారు. నూతన సాంకేతికతలను వినియోగించుకొని అర్జీలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. వికసిత్భారత్ జి-రామ్-జి అంశంపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ... అన్ని మండలాల ఎంపీడీవోలు అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులైన ఎమ్మెస్ ఎం ఇ పార్కుల ఏర్పాటు రైల్వే లైన్ క్రాసింగ్ పాయింట్లు ఏర్పాటు తదితర ప్రాజెక్టులకు అవసరమయ్యే భూ సేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హౌసింగ్ శాఖ పై సమీక్షిస్తూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ శాఖ అధికారులను మరియు సిబ్బందిని ఆదేశించారు. స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పై సమీక్షిస్తూ మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛతపై దృష్టి సారించి ప్రతిరోజు యాంటీ లార్వా కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలన్నారు. మునిసిపల్ నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మరియు స్పందిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తూ ఎంపీడీవోలు మరియు నీటిపారుదల శాఖ ఏఈలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఉన్న అన్ని చిన్న తరహా నేటిపారుదల చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలన్నారు. వికసిత్భారత్ జి రామ్ జి పథకాన్ని చెరువులకు నీటిని తీసుకువెళ్లే ఫీడర్ కాలువల పూడిక తీత తదితర పనులకు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పంపిణీ చేస్తున్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలు, రీ సర్వే మరియు స్వామిత్వ అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రెవెన్యూ శాఖ మరియు సర్వే శాఖ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి, రాయచోటి మరియు పీలేరు ఆర్డిఓ శ్రీనివాస్, అన్ని మండలాల తాసిల్దారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, ఇరిగేషన్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :