Saturday, 12 September 2026 05:33:40 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ లో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాసం

Date : 11 April 2026 08:42 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 11 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో “నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఫర్ ది ఏఐ-డ్రివెన్ వరల్డ్” అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనెట్రిక్ గ్లోబల్, బెంగళూరు-సింగపూర్ సంస్థకు చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ లలిత్ కుమార్ యాగ్నిక్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేటి యుగంలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా మానవ జీవన విధానాన్ని, పరిశ్రమలను మరియు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుతున్న శక్తిగా నిలుస్తోందని అన్నారు. ఐబీఎంలో దాదాపు 30 సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా, ఆసియాన్, భారతదేశం, అమెరికా వంటి ప్రపంచ మార్కెట్లలో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో విజయం సాధించాలంటే విద్యార్థులు ఏఐ, డేటా మరియు క్లౌడ్ సాంకేతికతలపై పటిష్టమైన పట్టు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా పునర్నిర్మించడం, నేర్చుకునే విధానాలు, ఉద్యోగావకాశాలు మరియు ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం దిశగా కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్లు తారకేశ్వర రాజు బి మరియు వి. శివరామన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: