Tuesday, 15 September 2026 11:45:15 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు

విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు

Date : 05 June 2026 05:39 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెండు రోజుల విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపు విశాలాంధ్ర, మదనపల్లి: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో మదనపల్లెలోని ఎస్‌టియు కార్యాలయంలో రెండు రోజులపాటు విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే. మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్పథం, రాజకీయ అవగాహన పెంపొందించడమే ఈ శిక్షణా తరగతుల ప్రధాన లక్ష్యమన్నారు. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు, యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోతున్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యపై కార్పొరేట్ వ్యవస్థలు కొనసాగిస్తున్న దోపిడీలు, విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించేందుకు నిపుణులు ప్రత్యేక ప్రసంగాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ప్రస్తుత జాతీయ కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వలరాజుతో పాటు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రెండు రోజుల శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కే. మాధవ్ పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :