నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 23 : మదనపల్లి పట్టణం లోని ఈశ్వరమ్మ కాలనీలో గల మాలిక్ మెగా ఫంక్షన్ హాల్‌లో జరిగిన షేక్ షాహిర్, షేక్ షాహిస్త వివాహ వేడుకకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనకు పెళ్లికొడుకు తండ్రి జనాబ్ షేక్ సర్దార్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాబ్జాన్, మహబూబ్ ఖాన్, టీడీపీ నాయకులు దాదాపీర్, శివకృష్ణ, కుమార్, జయరాంరెడ్డి, ప్రవీణ్ రాయల్, ఇర్ఫాన్, ఖాదర్ బాషా, చందు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News