నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తపస్యలో కన్నుల పండుగలా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - అలరించిన విద్యార్థినీ,విద్యార్థుల వేషధారణలు పీలేరు నియోజకవర్గం,కలికిరి మండలం,రెడ్డివారి పల్లి నందు గల తపస్య విద్యాసంస్థలో కరస్పాండెంట్ రామాంజులు నాయుడు,క్యాంపస్ ఇంచార్జ్ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థులు కృష్ణుడు,గోపికల వేషాలతో అలరించారు.పాఠశాల ఆవరణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. కొందరు విద్యార్థులు చిన్ని కృష్ణయ్యను తలుస్తూ నృత్య ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనమని సంస్కృతి,సాంప్రదాయాలు ఆచారాలను ప్రతి ఒక్కరు ఆచరించాలని,ఆలోచన నైపుణ్యం పెంపొందించు కోవాలని,విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.తమ పాఠశాలలో క్రమశిక్షణ,నాణ్యమైన విద్యాబోధన అందించడంతోపాటు జాతీయ పండుగలు,సాధారణ పర్వదినాలు నిర్వహించి విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.అనంతరం శ్రీ కృష్ణుడికి ప్రీతీకరమైన అటుకుల ప్రసాదం ఉపాధ్యాయులు,విద్యార్థులకు పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాధవి,ప్రేమలత,ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు,విద్యార్థినీ,విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News