నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 05 : ప్రభుత్వం ఏ.పీ.ఐ.ఐ.సి. కింద ఎం.ఎస్.ఎం.ఈ. ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణానికి రెడ్డి కోట వద్ద సేకరించిన భూమి విషయంలో నిరుపేద రైతుల కు న్యాయం చేస్తానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ హామీ ఇచ్చారు. శనివారం టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బి ఎం ఆర్ చొరవతో మాజీ ఎమ్మెల్యే రెడ్డి కోట కు చేరుకొని పార్కుకు కేటాయించిన కుక్క రాజు పల్లి దళితవాడ, రెడ్డి కోట లోని బీసీలకు చెందిన మూడు గ్రామాల నిరుపేద రైతుల భూములను ఎం ఎస్ ఎం ఈ పార్క్ నిర్మాణానికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ నిరుపేద రైతులు మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ కు తరతరాల నుండి మా పెద్దల నుండి సంక్రమించిన భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని ఆ భూమి లేకపోతే మాకు జీవనోపాధి లేక వలసలు వెళ్లాల్సి వస్తుందని ఆరోపించారు. దశాబ్దాలుగా అనుభవంలో ఉన్న మా భూముల కోసం పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మా భూములు కోల్పోతే ఎలా జీవించాలని భూముల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని మొరపెట్టుకున్నారు. రైతుల మొర ఆలకించిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెస్ ఎం ఇ పార్కులకు కేటాయించిన భూముల విషయం జిల్లా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడి ప్రతి నిరుపేద రైతుకు న్యాయం చేసి ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట బిఎంఆర్, రెడ్డి కోట, కుక్క రాజు పల్లి ఎస్సీ, ఎస్టి, బిసి రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News