నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇంటింటికి తెలుగుదేశంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం - ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధినాయకత్వం,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలో కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజలతో మమేకమై కష్టసుఖాలను తెలుసుకునేందుకు 45 రోజులపాటు ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.గురువారం 42వ రోజు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మదనపల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని 28,29,30 వార్డులలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యటించారు.ప్రతి వార్డులో మంగళహారతులతో,జయజయద్వానాలతో స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు.వార్డులలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కరపత్రాలు ద్వారా ప్రజలకు అందిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు పరిష్కరించాల్సిందిగా ఆదేశిస్తూ 3 వార్డుల పర్యటన కొనసాగించారు.30వ వార్డు తెదేపా ఇంచార్జ్ దుబ్బిగాళ్ల భాస్కర్,28 వార్డ్ ఇంచార్జ్ గౌస్ అజామ్,తెదేపా నేతలు నౌషాద్,27వ వార్డు ఇన్చార్జ్ కరిముల్లా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి పాలనలో అభివృద్ధికి నోచుకోని మదనపల్లి పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించామని,ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న సిటిఎం రోడ్డులో రోడ్డు విస్తరణ పనులను రెండు కోట్ల రూపాయలతో చేపట్టి తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం తీసుకొస్తున్నామని,కదిరి రోడ్డులో డ్రైనేజీలు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజల అభ్యర్థన మేరకు కోట్ల రూపాయలతో డ్రైనేజీలు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని,తాగునీటి సమస్య పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్లు ఏర్పాటు చేయడం నూతన బోర్లు డ్రిల్లింగ్ చేసి ప్రజల నీటి కష్టాలను తీరుస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా మైనారిటీ నాయకుడు ఫ్రూట్ మండి సర్దార్,టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,నవీన్ చౌదరి, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్,విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ,గంగారపు రామ్మూర్తి నాయుడు,బొమ్మిశెట్టి పురుషోత్తం,మస్తాన్,రఫీ,డాన్స్ రెడ్డి,ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి,బిల్డర్ రామకృష్ణ,సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోడెం సిద్ధప్ప,మార్పురీ గాంధీ,నీలకంఠ,కె.వి నాగరాజు,పద్మమ్మ,జాఫరున్ని షా,మాజీ కౌన్సిలర్ రాధా,పులి మహాలక్ష్మి,క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్,వేమయ్య,కొప్పల హరినాథ్,అడ్వకేట్ శైలజ,సికిందర్,ఇక్బాల్,టపాసుల బాబా,నాసిర్,షేక్ లతీఫ్,పోతబోలు వెంకటేష్,టౌన్ బ్యాంకు సోమశేఖర్ నాయుడు,మెడికల్ షాపు రమేష్ రెడ్డి,శ్రీనివాసులు నాయుడు,బాలమాలి శేఖర్,ఫిర్దోస్,నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News