నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రతి విద్యార్థి దేశభక్తి, సామాజిక స్పృహ పెంచుకోవాలి బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం.సహదేవరెడ్డి ప్రతి విద్యార్థి దేశభక్తి సామాజిక స్పృహ పెంచుకోవాలని బ్రిలియంట్ హై స్కూల్ కరస్పాండెంట్ మొరంపల్లి సహదేవ రెడ్డి సూచించారు.పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నందు గల బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు.శనివారం పాఠశాల కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి,ప్రధానోపాధ్యాయులుమొరుంపల్లి రజినీల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి.ఇందులో భాగంగా నీరుగట్టువారిపల్లి పురవీధుల్లో ఉపాధ్యాయులు,విద్యార్థులు త్రివర్ణ పతాకాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.స్వాతంత్ర సమరయోధులు,జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ సహదేవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశనుండే ప్రతి ఒక్కరు దేశభక్తి,సామాజిక స్పృహను పెంపొందించుకోవాలన్నారు.అందరూ స్నేహభావంతో మెలిగి ఐకమత్యాన్ని చాటాలన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడాలని సూచించారు.భారతదేశ చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు.తమ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతోపాటు జాతీయ పండుగలు,సాధారణ పండగల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,తద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు,ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Reporter
Namitha News