Saturday, 12 September 2026 12:07:17 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

Date : 11 September 2026 06:16 PM Views : 11

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు - హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,ప్రముఖులు మదనపల్లె : రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎంపి మిథున్ రెడ్డిపై అభిమానం ఉప్పొంగింది.ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని శుక్రవారం వైసీపీ నియోజకవర్గంలో యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఇందులో భాగంగా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శుక్రవారం మెగా రక్తదాన శిబిరం,2000 వేల మందికి అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.మదనపల్లె సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలుయువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ శిబిరంలో సుమారు 100 మంది వరకు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పాలు,బ్రెడ్,పండ్లు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలవవచ్చునన్నారు.హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) మాట్లాడుతూ యువతకు ఎంపీ మిథున్ రెడ్డి రోల్ మోడల్ అని,ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.అవసరమైన వారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా రక్తదానం చేసినట్లు తెలిపారు.పార్టీ కార్యకర్తల శ్రేయస్సు,ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పరితపించే ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజా రెడ్డి,మాజీ కౌన్సిలర్ ఎస్వి రమణ,ప్రసాద్ బాబు,ఈశ్వర్ నాయక్,డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి,పవన్ తేజ రాయల్,కోళ్లబైలు అనిల్ కుమార్ రెడ్డి,అన్వేష్,హర్ష యువసేన అంబులెన్స్ మహి,కౌశిక్ రాజు,అశోక్ రాయల్,పూర్ణ,గోవా,శివ,దీపక్,హరి,గణి,చంద్ర కాలనీ రామచంద్ర,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,మాధవరెడ్డి,నాగమణి,మేరీ,వినుతా భాయి,మంజుల,ధనలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: