నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 4 : రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ తో పాటు ఎంఎస్పి బలోపేతానికి నూతన కమిటీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి సంజీవ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం తంబళ్లపల్లెలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాత కమిటీలన్నీ రద్దు పరుస్తున్నట్లు ఇదే స్థానంలో కొత్త కమిటీలను యుద్ధ ప్రాతిపదికన గ్రామస్థాయిలో ఎంపికలు చేసి పనిచేసే వారికి ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. భవిష్యత్తులో ఎం ఎస్ పి రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, స్టూడెంట్స్ యూనియన్ సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కమిటీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను ఎంపిక చేసుకోవాలని నిర్లక్ష్యం వహించరాదని సూచనలు చేశారు. ఎం ఎస్ పి బలోపేతానికి సెప్టెంబర్ నెల 9వ తేదీన వరంగల్లో జరిగే జాతీయ ఎంఆర్పిఎస్, ఎం ఎస్ పి సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలని సభలో ఎం ఎస్ పి భవిష్యత్తు విధి విధానాలను అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉపదేశిస్తారని కాన ప్రతి మాదిగ తరలి రావాలని సూచించారు. ఎమ్మార్పీఎస్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి మధు ఎం.ఎస్.పి బలోపేతంపై నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటప్ప, పిచ్చిల వాండ్లపల్లి రమణ ,తంబళ్లపల్లె నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ప్రతాప్, ఇంచార్జ్ తిరుపాల్, తంబళ్లపల్లి ఇంచార్జ్ వేటా మల్లికార్జున, మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్, పెద్దమండెం నాయకురాలు రాములమ్మ, నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News