Sunday, 13 September 2026 08:15:11 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఏపీఐఐసి కోసం 84మంది నిరుపేద రైతుల పొట్ట కొట్టదండి

జీవనాధారమైన భూములు లేకపోతే ఆత్మహత్యే గతి అంటూ మదనపల్లె సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

Date : 28 January 2026 07:51 PM Views : 406

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 28 : ప్రభుత్వం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డికోట, కుక్కరాజుపల్లి పంచాయతీ లలోని నాలుగు గ్రామాలకు చెందిన 84 మంది నిరుపేద ఎస్సీ, బిసి రైతుల46.527 ఎకరాల భూములను ఏపీఐఐసీ కి ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై రెండు పంచాయితీల్లో ని దళితవాడ, ఈర్లవాండ్లపల్లి, పర్ల గొల్లపల్లి, రెడ్డికోటకు చెందిన నిరుపేద రైతులు గత నాలుగు మాసాలుగా జిల్లాకలెక్టర్, సబ్ కలెక్టర్, తాశీల్దార్లకు ఫిర్యాదులు చేశారు. గతవారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రైతులతో సమావేశమై రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రైతులు జీవనాధారమైన భూములు ఇచ్చేది లేదని గట్టిగా తమ వాదనలు వినిపించారు. అయినా రెవెన్యూ అధికారులు చాప కింద నీరులా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దల సంపాదించిన భూములు పోతే మాకు ఆత్మహత్య శరణమని జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏపీఐఐసీకి భూముల సర్వే ఓవర్గం నాయకుల సలహాతో రెవెన్యూ అధికారులు మా భూములు ల్యాండ్ యాక్యువేషన్ చట్టం ద్వారా లాక్కోవాలని చూస్తున్నారని, రెవెన్యూ అధికారులు భూ కేటాయింపు విషయమై సంబంధిత రైతులకు 26-1-2026 తేదీన పేపర్ యాడ్ వేశారు తప్ప భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వ కుండా గ్రామస్థాయిలో రైతులతో విచారణ చేయకుండా భూసేకరణ పేరుతో భూములు లాక్కుంటే మేము ఎలా బతకాలని నిలదీస్తున్నారు. మా పూర్వీకుల నుండి మా భూములలో మామిడి, టెంకాయ చెట్లతో పాటు పశుగ్రాసం, వ్యవసాయ పంటలు పండించుకొని జీవిస్తున్నామని ఆ భూములు లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని హెచ్చరిస్తున్నారు. టిడిపికి అండగా నిలబడితే మా భూములే లాక్కుంటారా! ః టిడిపి ఆవిర్భావం నుండి ఈ నాలుగు గ్రామాల బిసి, ఎస్సీ నిరుపేద రైతులు పార్టీకి అండగా నిలబడి ఓట్లు వేసి గెలిపించినందుకు మా భూములే లాక్కుంటారా అని నిరుపేద రైతులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు ఏపీఐఐసీకి అప్పగించాలని చూస్తే మా 84 కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడతాయని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాలాంటి నిరుపేద రైతుల భూముల లాక్కోవడం సమంజసం కాదని వెంటనే మా భూములను ఏపీఐఐసీకి అప్పగించే తంతును ఆపాలని లేదంటే నడిరోడ్డుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :