Saturday, 12 September 2026 01:52:29 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్

Date : 15 August 2026 06:39 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ అన్నారు. ‌80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె టౌన్ దొంతివీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్.రెడ్డీ సాహెబ్ ఆద్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ‌జాతీయ జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రజలందరికీ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ అహింస పద్దతి ఎన్నుకుని నాటి బ్రిటిష్ పాలకులపై పోరాటం సాగించారని, ఆయన స్పూర్తితో ఎందరో పోరాటంలో భాగస్వామ్యలై స్వాతంత్ర్యం సిద్దించడానికి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.‌ ఆ మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం అని వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే అని అన్నారు. ఈ 80. సంవత్సరాల పాలనలో దేశం గొప్పగా నిర్మితం అయిందని అన్నారు. బిజెపి పాలనలో సమాజంలో చీలికలు, బీజేపీ అవలంబించే సిద్ధాంతాలు, మతపరమైన విధానాలు సమాజంలో వర్గాల మధ్య విభేదాలను పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని, ఆర్దిక అసమానతలు పెరిగిపోయాయని అన్నారు.‌ రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీయడం, నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలతో ప్రదానమంత్రి, హోం మంత్రి దిగి రావడం జరిగిందన్నారు.‌ దేశ చరిత్రలో పార్లమెంటు సమావేశాలు ఇంత తక్కువ రోజులు జరగడం, సరైన చర్చలు జరగలేదని, బిజెపి పైన ఏర్పడిన వ్యతిరేకతకు ఇదే నిదర్శనం అన్నారు.‌ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తితో మనమంతా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె టౌన్ మైనారిటీ అధ్యక్షులు మహబూబ్ పీర్, రూరల్ మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, జిల్లా మైనారిటీ ప్రదాన కార్యదర్శు ముబారక్ ఖన్, ఇర్ఫాన్, జిల్లా మైనారిటీ కార్యదర్శి ఖాదర్ బాషా, అప్సర్ షరీప్, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్, సీనియర్ నాయకులు బండపల్లి ఈశ్వరయ్య, డాక్టర్ వర్దన్ చౌదరి, మహమ్మద్ రఫీ, నాగరాజు, ఖాసీం వలి, అల్లాబక్షు, రాజశేఖర్ నాయక్, రవీంద్ర, మస్తాన్, చాంద్ బాచా, ద్వారకానాథ్ రెడ్డి, శ్రీనివాసులు, షాజహాన్ (రాజా), షరీఫ్ పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: