Saturday, 12 September 2026 12:07:51 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు

జ్యోతి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం - తన ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు : కె.వాణి

Date : 11 September 2026 05:37 PM Views : 34

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు - జ్యోతి తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం - తన ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు : కె.వాణి మదనపల్లె : మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదని నేషనల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధి కే.వాణి పేర్కొన్నారు.శుక్రవారం కురబలకోట మండలం,అంగళ్లులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మదనపల్లి పట్టణానికి చెందిన జ్యోతి వద్ద గతంలో తాను రూ.లక్ష తీసుకున్న మాట వాస్తవమేనని,అయితే వడ్డీతో సహా తిరిగి ఆమె మొత్తాన్ని చెల్లించేశానన్నారు.మళ్లీ తాను రూ.8 లక్షలు చెల్లించాలని ఆమె ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఇదిలా ఉండగా ఆమె దగ్గర కొంతమంది వడ్డీకి నగదు తీసుకున్నారని,వారు సరిగ్గా చెల్లించలేదని తన దృష్టికి తీసుకురాగా,దీంతో దివ్యాంగురాలనే మానవతా దృక్పథంతో వడ్డీలకు తీసుకున్న వారికి ఫోన్ చేసి జ్యోతికి నగదును చెల్లించాలని వారిని కోరడం జరిగిందన్నారు.వెంటనే కొంతమంది ఆమెకి ఇవ్వాల్సిన నగదు చెల్లించారన్నారు.తదనంతరం వడ్డీలు తీసుకున్న కొంతమంది మావద్ద 20 నుండి 30 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేయగా,ఇలా చేయడం తప్పు అని జ్యోతికి సూచించానన్నారు.అప్పటినుండి తనపై కక్షపెంచుకుని లేనిపోని ఆరోపణలు చేస్తోందని,గౌరవప్రదమైన హోదాలో ఉన్న తన పరువును బజారుకు ఈడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తాను జ్యోతికి ఎటువంటి అప్పులేనని స్పష్టం చేశారు.తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని,ఈ విషయంపై తాను పోలీసులు ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.ఇప్పటికైనా తనపై ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.ఈ అంశంలో పోలీసులు విచారించి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న జ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: