నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25: అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డిఎస్పీ గా డి. ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మదనపల్లి లోని డిఎస్పీ కార్యాలయం లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ డిఎస్పీ గారికి ఎస్పీ గారు పలు కీలక సూచనలు మరియు ఆదేశాలు జారీ చేశారు సాయుధ దళ విభాగంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అత్యున్నత స్థాయి క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఏఆర్ విభాగంలో పనిచేసే సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సిబ్బందికి నిరంతరం వృత్తిపరమైన శిక్షణ అందించాలని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులకు ఏఆర్ విభాగం పూర్తిస్థాయిలో సమన్వయం అందిస్తూ మద్దతుగా నిలవాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
అనంతరం ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా, క్రమశిక్షణతో కూడిన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు
Admin
Namitha News