Friday, 19 June 2026 05:08:24 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

డిప్యుటీ సీఎం పవణ్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

101 టెంకాయలు కొట్టి అమ్మవారిని వేడుకొన్న జనసైనికులు

Date : 20 April 2026 11:46 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : కోట్లాదిమంది గుండెచప్పుడు, జనసైనికుల రథసారథి, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కలసి పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కోట్టి పుంగనూరు ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి వారిని మనస్పూర్తిగా వేడుకునీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. మా అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకొని యధావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మ వారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు.ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామరక్షగా ఉంటుందని ఆకాంక్షించారు.మా ఆదినాయకులు పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మ వారి ఆశీస్సులతోపాటు, ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్,పండు రాయల్, రవి కుమార్, మహేష్, సీన, మహేష్ , భార్గవ్, గజ, నాగరాజ, పవన్ కుమార్,పల్లవి, గిరి, మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :