Sunday, 13 September 2026 03:45:55 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మానసిక ఒత్తిడిని నియంత్రించడమే లక్ష్యం గా పోలీసులకు మెడిటేషన్ శిక్షణ

హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ మూడు రోజుల పాటు శిక్షణ

Date : 21 May 2026 11:01 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణం లోని బసవరాజా ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో నేటి నుండీ మూడు రోజుల పాటు పుంగనూరు అర్బన్ & రూరల్ సర్కిల్ పరిధి లోని పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి యోగా, మెడిటేషన్ శిక్షణ శిబిరం ను నిర్వహించనున్నట్లు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ను ఈ రోజు నుండి మూడు రోజుల పాటు హార్ట్ ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ నిపుణులు శివశంకర్ ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్‌నెస్ మెడిటేషన్ ప్రత్యేక శిక్షణ నిర్వహించబడుతోందని తెలుపుతూ ఈ మెడిటేషన్ వలన మనలో విధి నిర్వహణలో ఒత్తిడిని నియంత్రించేందుకు దోహదపడుతోందని, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే మార్గదర్శకంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు, కోపం ను నియంత్రణ చేసుకోవచ్చు, సమయానుకులంగా సమర్థవంతంగా వినియోగించుకునే పద్ధతి ని అలవర్చుకోవచ్చు, విధులను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు దోహదపడుతొందని తెలియచేసారు. ఈ రోజు పుంగనూరు అర్బన్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు, రూరల్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది హాజరయ్యారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హార్ట్ ఫుల్‌నెస్ ఇన్స్టిట్యూట్ తరఫున మహిళా శిక్షకురాలు మానస, రాధ, శ్రీరాములు, బాల వెంకటరమణ, శ్రీధర్ , నారాయణ రెడ్డి పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :