Monday, 14 September 2026 08:25:00 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఏఎంసీ చైర్మన్ల

కూటమి ప్రభుత్వ రెండేళ్లు పూర్తి - విజయోత్సవాల్లో పాల్గొన్న నాయకులు

Date : 05 June 2026 02:42 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఏఎంసీ చైర్మన్ల కమిటీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవాల్లో పాల్గొన్న నాయకులు : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షుడు జంగాల శివరాం, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, పీలేరు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తితో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువాతో సన్మానం చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్యుల సమక్షంలో కేక్ కట్ చేసి విజయోత్సవాలను నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడఅమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి ప్రసాద్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, పీలేరు ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి, పీలేరు జనసేన ఇన్‌చార్జి దినేష్, పుంగనూరు జనసేన ఇన్‌చార్జి చిన్న రాయల్, తంబళ్లపల్లి జనసేన ఇన్‌చార్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, మార్కెట్ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులతో చర్చించినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ల కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :