Sunday, 13 September 2026 11:01:25 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సర్వమతాలకు అతీతం కడప అమీన్ పీర్ దర్గా.... గంధోత్సవంలో పాల్గొని ఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్

Date : 08 November 2025 07:50 AM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వమతాలకు అతీతం కడప అమీన్ పీర్ దర్గా.... గంధోత్సవంలో పాల్గొని ఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.... దేశంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కడప అమీన్‌ పీర్‌ పెద్ద దర్గాలో వెలసిన హజరత్‌ సరమస్త్‌సాని చల్లాకష్‌ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్‌ మహమ్మదుల్‌ హుసేనీ చిస్టివుల్‌ ఖాద్రి ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొని చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కడప జిల్లాలోని పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని, సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారని వివరించారు. అమీన్ పీర్ దర్గా వ్యవస్థాపకుడు హజరత్ పీరుల్లా మాలిక్, ఇక్కడ పెద్ద ఉరుసును మాత్రం సూఫీ సర్ మస్తానీ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి పేరిట నిర్వహిస్తారని, కాలక్రమేణా అమీర్ పీర్ దర్గాగా పేరొందిందని, ప్రస్తుతం ఈ దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.కడప పెద్ద దర్గా సందర్శించడానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగే ఉరుసు ఉత్సవంలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :