Sunday, 13 September 2026 10:17:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి - అధికార పార్టీ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొందాం

- ఎమ్మెల్యేలు,ఇన్‌చార్జుల కు వైకాపా అధినేత జగన్ దిశానిర్దేశం - రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి హజరైన ఎస్.నిసార్ అహమ్మద్

Date : 25 August 2026 05:23 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి - అధికార పార్టీ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొందాం - ఎమ్మెల్యేలు,ఇన్‌చార్జుల కు వైకాపా అధినేత జగన్ దిశానిర్దేశం - రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి హజరైన ఎస్.నిసార్ అహమ్మద్ మదనపల్లె : సిఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి ఎలాంటి కుయుక్తులైన పన్నుతుందని,సమర్థవంతంగా ఎదుర్కొని ధీటైన అభ్యర్థులను నిలపడానికి సిద్ధంగా వుండాలని వైయస్సార్ సిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్‌లు,ఎమ్మెల్యేలతో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్,రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డితోకలిసి మదనపల్లె వైయస్సార్సిపి సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్‌ పాల్గొన్నారు.సమావేశం అనంతరం ఎస్.నిసార్ అహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలు సలహాలు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి చెక్ పెట్టెవిధంగా వ్యవహరిస్తామని తెలియజేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని‌,ఆ మేరకు అన్నిరకాల సర్వేల ద్వారా తెలుస్తోందని జగన్మోహన్ రెడ్డి తెలిపారని వెల్లడించారు.స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారని,ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని,మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలుని జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారని తెలిపారు.అయితే చంద్రబాబునాయుడు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరని,అందుకు తగినట్లుగా వ్యవహరిస్తామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెడతాం,పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి,పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాజంపేట ఎంపి మిథున్ రెడ్డి ఆదేశాలు,సూచనలు మేరకు ఎన్నికలలో ధీటైన అభ్యర్థులు నిలపడం పక్కా అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి వైసిపి నాయకులు చిప్పిలి మల్లికార్జున రెడ్డి,కొత్తపల్లి నాగార్జున నాయుడులు సైతం హాజరయ్యారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :