Sunday, 13 September 2026 06:03:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి - నిసార్ అహమ్మద్

Date : 30 December 2025 04:37 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. మదనపల్లె రూరల్ అమ్మచెరువుమిట్ట కోళ్లబైలు పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార గుండా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్దానిక వైసిపి నాయకులు నిసార్ అహ్మద్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం పూజారులు శఠగోపం తలపై పెట్టి దీవెనలు అందించారు. అనంతరం భక్తులకు నిసార్ అహ్మద్ చేతులమీదుగా అన్నదానం నిర్వహించారు. ‌ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశికి విశేషమైన విశిష్టత ఉందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోటి పుణ్యాలు ఇస్తుందన్నారు. ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రమైన రోజు అని ముక్కోటి ఏకాదశి అంటారని వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడనే ప్రతీతి అన్నారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉందన్నారు. హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారని అన్నారు. నిసార్ అహ్మద్ తోపాటు ఎస్.రమేష్, దండు రామాంజులు, కృష్ణారెడ్డి, రామమోహన్, మధు, కౌన్సిలర్లు శివ, ఈశ్వర్ నాయక్, పూజారి చరణ్, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి, మహేష్ కొత్తపల్లె, యూనస్, సాదిక్, యాసిన్, సమద్, పురాణం వెంకట్రమణ, మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: