Saturday, 12 September 2026 02:41:45 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

DSC-2025 అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కధం తొక్కిన వైసీపీ శ్రేణులు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Date : 10 August 2026 02:56 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 10 : వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు DSC–2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ లో పాల్గొన్న యువకులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఈ సందర్బంగా మదనపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఎస్ నిసార్ అహమద్ మాట్లాడుతూ ఇన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ DSC అక్రమాలపై విచారణ కోరుతూ వివిధ రకాల ఆందోళనలు, నిరసనలు, వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారపక్షం వైఖరి ఉందని తీవ్రంగా ఆరోపించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. విచారణ కు ప్రభుత్వ పెద్దలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు

ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ… DSC–2025 నియామకాల ప్రక్రియపై అభ్యర్థులు, నిరుద్యోగ యువతలో అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయని తెలిపారు. అభ్యర్థుల మెరిట్, ర్యాంకులు, రోస్టర్, పోస్టుల కేటాయింపు, కౌన్సెలింగ్ ప్రక్రియ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మదనపల్లి పరిశీలకురాలు అనీషా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, అర్హతలు, మెరిట్, ఎంపిక విధానం తదితర అంశాలను పూర్తిగా పరిశీలించాలని కోరారు. DSC–2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఆమె డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, సీనియర్ నాయకులు ఎన్. శ్రీనాథ రెడ్డి , వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కరీముల్లా, సి హెచ్ రామచంద్రా రెడ్డి, ఎం పి పి వెంకట రమణారెడ్డి , రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.పి. రాఘవ రెడ్డి, ఆవుల మల్లికార్జున, రాధాకృష్ణ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్. మస్తాన్ ఖాన్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. ఇర్ఫాన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి హేమంత్, పవన్ రాయల్, జిల్లా కార్యదర్శి ఫిరోజ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుదిటి చరణ్, తాజ్ భాషా, నూర్ మొహమ్మద్ ఖాన్, తాహిర్, నాసీర్, కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, ఖాజా, సుగుణా ఆంజనేయులు, ఈశ్వర్ నాయక్, పాల్ చంద్రశేఖర్, బాలగంగాధర్ రెడ్డి, నాయకులు శీలం రమేష్, వెలుగు చంద్ర, బొమ్మిశెట్టి మధు, ఎన్. నవాజ్ అలీ ఖాన్, నూరుల్లా, ఎన్. ఫిరోజ్, కొత్తపల్లి మహేశ్, రాజేశ్, చెన్న కృష్ణ, నవీన్, అరుణ్, కొత్తపల్లి నాగార్జున నాయుడు, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఆర్.ఐ. రమణ రెడ్డి, రాజేంద్ర నాయుడు, రెడ్డి వీరే గౌడ్, శారదా రెడ్డి, భువనేశ్వరి, వినూత బాయ్, నాగమణి, ధనలక్ష్మి, యూనస్, రియాజ్, వలసపల్లి నాగరాజ రెడ్డి, కొత్తవారిపల్లి మహేశ్, శ్రీకాంత్ రెడ్డి, షేక్ జబి, మాధవ రెడ్డి, ఆవుల సోమశేఖర్ రెడ్డి, సాంబశివ రెడ్డి, ఆవుల విశ్వనాథ్, చీకలబైలు చంద్ర, చలపతి, సత్తార్, జైనుల్లా, ఫక్రుద్దీన్, సమద్, సాధిక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :